Sunday, 28 September 2014

విజయం

అటో ఇటో అనుకున్న వారే విజేతలవుతారు
మధ్యలో ఊగిసలాడేవారు ఊగుతూ ఉంటారు
కోరికల్ని జయించి కర్తవ్యాన్ని పాలించేవారు
ఎప్పటికీ క్రిందకి జారక శిఖరాగ్రాన్నే ఉంటారు

Tuesday, 9 September 2014

నా పిచ్చిరాతలు

ఏం రాయను మనసు భాషరాని దానను
ఏదేదో చెప్పాలి అనుకుంటాను చెప్పలేను
అక్షరాలు కరుణిస్తే  అందంగానే రాస్తాను
ఏదో రాసానని చదవడం మానరనుకుంటాను


Monday, 1 September 2014

మాలోకం

అనుబంధాలు వాటంతట అవి ఎప్పుడూ చావవు
స్వార్థం, అజ్ఞానం, అహం, వాటిని హత్యచేస్తాయి
కనులుతెరిచి  బ్రతుకుదామంటే ఏడిపించే లోకం
కనులుమూస్తే ఏడుస్తుందెందుకో వెర్రి మాలోకం!