Wednesday 29 April 2015

తెలిసిందిలే

మట్టిలో పూడ్చిపెడితే తెలిసింది మమకారమేదో
మమతలెరుగనివారు సైతం కన్నీరు కార్చెదరని
చచ్చినవాడి కళ్ళు చాటంత విశాలం అయినవని 
మనిషి చచ్చిపోతేనే మంచి బ్రతికి బట్టకట్టగలదని

Saturday 25 April 2015

ఆశ



హృదయం దొరికెనని నింగి నేలనే తాకబోతే
అడుగుల సవ్వడే తప్ప ఆకారమే లేదాయె
పొరబడితినిలే అని మరల పైకి ఎగరబోతే..
రెక్కలే తెగిపోయి గమ్యమే తోచకున్నదాయె!

Sunday 19 April 2015

ఏ బంధం


ఏ బంధం మనది అంటే ఏం చెప్పను!?
భాధల్లో ఏ బంధం లేని నువ్వు గుర్తొచ్చే
అనురాగబంధం మనది అని చెప్పనా....
మరువబోతే మనసునే మెలిపెట్టేది అననా!

Thursday 16 April 2015

ముఖము

నిజం నిరూపించలేని నా పై నింద వేయకు
కాలానికి ఆ శక్తి ఉందని నీవు మరచిపోకు
అద్దంవంటి నాలో నీ ముఖము చూసుకుని
మచ్చలెన్నో అగుపిస్తున్నాయని పారిపోకు...

Tuesday 14 April 2015

ఎందుకు



నేను ఎందుకు ఉండాలి వేరొకరికి నచ్చినట్లు
ఆశలన్నీ అణచుకుని అందరూ మెచ్చేటట్లు
ఎందుకు అనుకరించాలి నాకు అస్తిత్వంలేనట్లు...

Tuesday 7 April 2015

ఆట

నీ హస్తరేఖల్లో నన్ను ముడిచి ఏం మురిసేవు
విధి లిఖించని బంధాన్ని పలుమార్లు ఏం కోరేవు
వరించని వలపు విజయానికై ఏల ఈ ప్రాకులాట
మనసుతో మనమే ఆడనేల ఈ తోలుబొమ్మలాట

Saturday 4 April 2015

గురి


మనిషి ఎన్నడూ గొప్పవిషయాలు మాట్లాడి జ్ఞానికాడు
చిన్ని చిన్ని విషయాలని అర్థం చేసుకుంటే అవుతాడు
విల్లుకాడు ఎవడూ వ్యర్థమైన వాటిపై బాణం సంధించడు
కావలసిన దాన్ని గురిచూసి విల్లు ఎక్కుపెట్టి సాధిస్తాడు