Tuesday, 23 August 2016

తీర్పు

కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!

Thursday, 4 August 2016

పరిపాటి

ఆశ్రువులు ఆనందం అనేకసార్లు అనుభవమే
నిరాశ పడ్డం ఆశతో అడుగువేయడం అలవాటే
సహకారం ఇవ్వలేదని ఎవరి పైన అలుగను
నా చేతకానితనం విధిరాతదని నింధించలేను..