Friday, 15 December 2017

ద్వారం

ఒక తలుపు మూసుకుపోతే
వేరొకటి తెరిచే ఉంటుంది....
మనమే మూసిన ద్వారం వంక 
చూస్తూ బేలగా ఉండిపోతుంటాం!!!

Sunday, 3 December 2017

నాలో..

నాలోన తాను, తనలోన నేను
మరిచేము అనురాగ బంధాన మేను
నిండైన వెన్నెల్లో ఏకాంత తరుణాన
చూపుల్తో మౌనాన్ని దాల్చేము మేము..

Friday, 13 October 2017

వెలుగు

రేయంతా తారలు విరహంతో రగిలే
వెనుక తిరిగి చూడనన్న జ్ఞాపకాలు 
కాళ్ళ పగుళ్ళు ఆలోచనలై మండగా
బయట వెలుగు మదిన చీకటి కాసె!

Friday, 6 October 2017

ప్రేమంటే

ప్రేమంటే మనసులో పుట్టి ఆకాశం అంచులు తాకేది
ప్రేమంటే ఉదయించే వెలుగే కాదు అస్తమించే చీకటి 
ప్రేమంటే అనేకసార్లు మోడుబారినా చిగురించే ఆశలు
ప్రేమంటే నిట్టూర్పు నిరాశ సెగలు కాదు ఒక భరోసా! 

Thursday, 21 September 2017

తెలిసే

గెలుపు ఎంత గొప్పదో తెలిసేది ఓటమితో
మాటలెంత మధురమో తెలిసేది ఓదార్పుతో
మరుపు ఎంత మంచిదో తెలిసేది వేదనతో 
ఏ విషయమైనా తెలిసేది అనుభవాలతో... 

Sunday, 10 September 2017

ధ్వేషం

మన వైపు వేలెత్తి చూపిస్తున్నారు అంటే
వారికి మనల్ని తాకే తాహతు లేదన్నట్లే
ధ్వేషం తల ఎత్తుకుని తిరుగుతుంటే...
ప్రేమ తాయెత్తు మహిమ చూపాలంది!

Saturday, 19 August 2017

వేదన

వెంటాడుతున్న జ్ఞాపకాలు
దూరమైన అనుబంధము
వినిపించదు విరహవేదన  
ఆలాపిస్తుంది ఆత్మరోదన! 

Saturday, 5 August 2017

ప్రయాస

కనులనిండా నీరు పెదవులపై నవ్వు
ఆనందాన్ని నటిస్తూ జీవిస్తున్నా..
ఇలాంటివారి కోసం ఎదురుచూస్తున్నా
విరిగిన మనసు అతికే వైద్యం వెతుకుతున్నా!

Tuesday, 18 July 2017

జీవితసారాంశం

నీటిప్రవాహంలో ఇసుకరేణువులు కనబడ్డం
కనులు మనల్ని మోసం చేయడం ఒకటే
ధ్యేయాలు కూడా తమ దిశను మార్చేను
ఇదేనేమో జీవితపు అసల్సిసలైన సారాంశం

Tuesday, 20 June 2017

తెలిసె

లోకం వెలిగితే తెలిసె నువ్వు నవ్వావని
వనం వికసించితే తెలిసె నువ్వు వచ్చావని
తనువు తడైతే తెలిసె నువ్వు తడిమావని 
మనసు చెమరిస్తే తెలిసె నువ్వు చూసావని!

Monday, 5 June 2017

తరుణం

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

Friday, 12 May 2017

కరుణ

నీవు లేక నేను శ్వాస కూడ తీయలేను
గుండె నిండుగా గూడుకట్టి ఉన్నది నీవే
నీవు దరిలేక మనసున విరహం పెరిగెనే
కాలం కఠినమైన నీవు కరుణ చూపరాదా!

Wednesday, 26 April 2017

వేడుక

వ్యధలను వేడుకతో వ్రాస్తూ..
నిట్టూర్పులను నిద్రపుచ్చాను!
జనం వాటిని చదువుకుని..
ఆహా ఓహో అంటే మురిసాను!  

Wednesday, 15 March 2017

దోషులు

లోపల గుచ్చుతున్నాయి కొన్ని గాజుముక్కలు 
వలపు వ్యామోహంలో వేసినవా వెర్రి గెంతులు 
ప్రేమ వలలో చిక్కి విరిగిన మనసు ముక్కలు  
వయసు ఉనికి ఉరికి చిక్కిన వారు దోషులు..

Friday, 24 February 2017

నవ్వు

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనుకుంటాను
నవ్వుకి ప్రతిఫలంగా ఆనందం కావాలంటాను 
పెదాల సహకారం కళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని 
ఇక బాధలకు విడాకులు ఇచ్చి నవ్వేస్తుంటాను.   

Tuesday, 14 February 2017

మరపు

పదాలు  పరిచయాలు గుర్తు రావడంలేదు
నిన్ను వలచినాక శ్వాసే గుర్తుండడంలేదు 
నీ సాంగత్యంలో ఉండి నిను వీడి వస్తుంటే
నన్ను నీ చెంతనే వదలి మరచిపోయాను!  

Monday, 9 January 2017

వదిలెయ్

సమయం దొరికినప్పుడు 
పగప్రతీకారాలని పాతిపెట్టేయండి
ఏమో ఎవరు చెప్పొచ్చారు 
శ్వాసించే సమయం ఎప్పటివరకో!