Tuesday, 24 June 2014

సంభాషణ

కష్టాల్లో కడదేర్చడానికి దేవుడున్నాడుగా
వేడుకుందాం ఎప్పుడు దారి చూపుతాడో!
 సరళసంభాషణలు పూలజల్లులన్నారుగా
వాదులెందుకు పలుకరింపు పూలేరుకుందాం!

Thursday, 12 June 2014

మనసు

వద్దన్నా నా మనసు నిన్నే వలచింది
తప్పొప్పుల సమరమే జరిగిపోయింది
నాటి చిరునవ్వే నేడు కన్నీరుకార్చింది
నా మనసు నన్ను వీడి వెళ్ళిపోయింది