Thursday, 23 June 2016

నవ్వు

ఆశ్రువులతో గాయాలైతే కడుక్కోను
అందిన ఆనందాన్ని జారవిడుచుకోను
భాధలు ఎన్ని ఎదురైనా లెక్కచేయను
ఏడవడం రాదంటూ నవ్వుతో కప్పేస్తాను

Sunday, 12 June 2016

చేతకాదు

ఒరేయ్ వెర్రివాడా నువ్వు నన్నేం మోసగించగలవు
కళ్ళలో చూసి మాట్లాడలేక ముఖం దించుకుంటావు
నా సమాధి దగ్గరకి వచ్చి చితికి నిప్పు అంటించబోకు
అపరిపక్వతతో నీ చేతుల్ని నీవేకాల్చుకుని  ఏడ్చేవు!