Thursday, 29 May 2014

ఆకాంక్ష

స్నేహితుడై ఉండి శత్రువులా దూరమైనావు నాకు
అయినా నువ్వు నావాడివే అన్న నమ్మకం నాకు
నువ్వు నాకే దక్కాలని కోరుకుంటానని అనుకోకు
నీ బాహువుల్లో ఊపిరి పోవాలన్న ఆకాంక్ష నాకు

Monday, 12 May 2014

మరిచా..

మాటలెన్నో ఎదను తడితే
కంటిరెప్పలనే విప్పార్చా..
హృదయ ద్వారము తెరిచా
మనసిచ్చి అడగడం మరిచా