Saturday, 15 November 2014

మాట


పెదవి దాటని పలుకులతో
మహారాణిని అవుతా నేను
పెదవి దాటి మాట్లాడినచో
వాటికి నే బానిసనవుతాను

Monday, 10 November 2014

కర్మఫలితం



జీవితంలో నీవు అనుకున్నది ఏదైనా సాధించాలని సాగిపో
సాగుతూ ఇతరుల మదిని చీలుస్తూ నీదారిని ఏర్పరుచుకోకు!
జీవితం నవ్విస్తే చేసిన మంచిపనులకి కర్మఫలితం అనుకో
ఏడిపిస్తే మంచి పనులు చేయవలసిన సమయం వచ్చెననుకో!

Wednesday, 5 November 2014

సాహాసం



ఇసుకరేణువులు వంటిది ఒక జీవితం..
గాజుముక్కలతో ఎందుకనో ఈ సావాసం
పట్టుకుంటే జారి ముట్టుకుంటే గుచ్చుకుని
అయినా కలిసి ప్రయాణం వృధా సాహాసం!