Friday, 27 February 2015

సరదా

సమయం అంటే నాకు కడు సరదా.....
ఔనన్నా కాదన్నా సాగిపోతానంటుంది
హృదయానికి వేసేయి నీవు పరదా.....
వలదన్నా దాని పంతమే నెగ్గాలంటుంది

Wednesday, 18 February 2015

నాకొచ్చిన విద్య


మదినొకటి పెదవితో వేరొకటి పలుకడం రాదు
వేటగానిలా ఎదుటివారి మనసు విరచలేను
నాకు తెలిసీ నాదంటు నాకొచ్చిన విద్య ఒక్కటే
ఎవరైనా నాపేరు పలికినప్పుడు నవ్వై విరియడం

Friday, 6 February 2015

నవ్వుతూ

నగుమోములో భాధల్ని బంధించేయి
మితభాషిగా చెప్పవలసింది చెప్పేయి
నీ అలకమాని అందరినీ అలరించేయి
బ్రతుకుతూ బ్రతికే మార్గం చూపవోయి