ఆకాంక్ష
Sunday, 24 May 2015
రాని కలలు
నిదురరాని కనులు మూసి కలలు రావు అని
నల్లని వస్త్రాల్లో జ్ఞాపకాల చారికలు కనబడవని
దేహం, మేలి ముసుగు కూడా నలుపుదే వేస్తే
కంటికి కారుచీకట్లే కమ్మి గమ్యం కానరాకుంది!
Monday, 4 May 2015
తీరనికోరిక
నా ప్రేమలో మునిగిపోయి నువ్వు ప్రసిద్ధి చెందావే కానీ
లేకపోతే నలుగురిలో నీవెన్నాడూ చర్చనీయాంశం కావు
నాకంటూ ఒక తోడుకై నా చూపులెన్నో దారులు వెతికింది
ఆ తీరని కోరికేదో జీవితాంతం నన్ను బాటసారిని చేసింది!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)