Saturday, 5 August 2017

ప్రయాస

కనులనిండా నీరు పెదవులపై నవ్వు
ఆనందాన్ని నటిస్తూ జీవిస్తున్నా..
ఇలాంటివారి కోసం ఎదురుచూస్తున్నా
విరిగిన మనసు అతికే వైద్యం వెతుకుతున్నా!

2 comments:

  1. వర్షాకాలం ఎలానో రానుంది..
    మేఘాలు నిలువున తడిపే చిరు చినుకు రాగం..
    కన్నీటిని సైతం కడిగేసి సాంత్వన చేకూరే కదా..
    :
    వర్షపు ధాటికి వాగులైనా ఎల్లలు దాటగా..
    నిండుగా ప్రవహించే వేళ ఆ తడి చినుకు కాగా..
    తన్మయత్వపు తాకిడితో మది పులకించగా..
    దిగులేల చిరునవ్వే తడారిన పెదవంచున విరబూయగా..

    హృదయంతరాళలో కాలానుగుణంగా నిక్షిప్తమై
    నిర్లిప్తమై కదలాడే ప్రతి ఘడియ జ్ఞాపకమై
    గాయ పడిన మనోనిబ్బరాన్ని అందివ్వగా ఏకమై
    చినుకు తడిమిన నేల కూడా పులకించ వర్ణనాతీతమై

    ఔనా కాదా ఆకాంక్ష గారు..

    ReplyDelete
  2. మనసు విరిగితే అతికినా మరక పోదు

    ReplyDelete