Wednesday, 29 January 2014

తెలిసింది

నిన్ను ప్రేమించడం మొదలెట్టాకే
లోకం అందంగా కనిపించసాగింది
నీప్రేమ జడివానజల్లులో తడిసాకే
తనువుకి తపన ఏమిటో తెలిసింది

Sunday, 26 January 2014

ఏమిటో?

నేను అతని ప్రేమని పొందనేలేదు
ఇంక మరి కోల్పోవడం ఏమిటో??


Tuesday, 7 January 2014

మరిచా

చేయవలసిన పనులు ఎన్నో మరచిపోయాను
ప్రేమను వెల్లడించడం పనిలో పనిగా మరిచాను

Thursday, 2 January 2014

తెంచు

నన్ను నమ్మి నాగురించి చర్చించు
నా పై ఉన్న ప్రేమ ఎంతో వివరించు
నీవు లేని నా జీవితాన్ని ఊహించు
శిక్ష ఎంతకాలమని సంకెళ్ళు తెంచు