ఆకాంక్ష
Tuesday, 31 March 2015
ఇదేమి వింతో
తలచినది ఎప్పుడు జరుగదు అనే మూడుపదాల
పాఠమే ప్రతిసారీ జీవితం నాతో వల్లె వేయిస్తుంటే..
వందసార్లంటే నేను వెయ్యిమార్లు వల్లెవేస్తున్నాను
పునాదులే లేని గాలిమేడలే కట్టి మురుస్తున్నాను
Saturday, 21 March 2015
కాలం
పండగైనా కాకపోయిన ఏంటి?
పబ్బం గడపడమే కావలసింది
గతిలేక గడిపే కాలానికి ఏంటి?
సాగినంత కాలం సాగుతూంది
Sunday, 15 March 2015
హృదయం
ఇరువురికీ కావలసింది హృదయమే!
ప్రేమించిన వారికి కావాలి హృదయం
ప్రాణం తీసేవాడికి కావాలి హృదయమే
ఒకరికి నీవు ఇస్తే వేరొకరు లాక్కుంటారు!
Saturday, 14 March 2015
ఎవరు రారు
మన కన్నీళ్ళని ఎవరూ చూడరు
మన వ్యధని ఎవరూ గమణించరు
మన భాధలు ఎవరూ భరించరు
మన తప్పులు అందరూ ఎంచుతారు!
Saturday, 7 March 2015
పూలు
ఏమీ ఆశించకనే ఎవరికైనా సహాయం చేయండి
ఎందుకంటే! ఎవరో అన్నట్లు....
"పూలు అమ్మే వారికి పైకం కొంచెం అయినా
పరిమళం మాత్రం అంటుతూనే ఉంటుంది ప్రతిసారి"
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)