Friday, 14 December 2018

ఎక్కువ

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ…
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ…
ఇష్టంతోచేసే పనులకు విజయాలు ఎక్కువ…
అందరిలో మంచినే చూస్తే ప్రశాఒతత ఎక్కువ!

Tuesday, 4 December 2018

కావాలి

నాకూ కావాలి పరిగెత్తించే నాదైన ఒక్కక్షణం
నాకూ కావాలి ఎదమూలల్లో దాగిన పరిమళం
నాకూ కావాలి నేను తాకాలనుకున్న ఆకాశం
నాకూ కావాలి కప్పుకునే ఆశలరెక్కలు దుప్పటి

Friday, 6 July 2018

కునుకు

మధ్య రాత్రిదాటి చాలసేపయ్యింది
దాదాపు లోకం నిద్రపోతుంది
కంటికి కునుకు మాత్రం రాకుంది
మెదడు పనికి మనసు జాలిపడింది

Thursday, 22 February 2018

ఆశ


రెక్కలు విప్పిన మనసుని రెచ్చగొట్టి
ప్రేమాభిమానాలు ఇంధనంగా నింపి 
ఆకాశానికి అర్రులు ఆశగా చూసాను 
గమ్యం అగుపించక అల్లాడుతున్నాను!

Thursday, 25 January 2018

కుతి..

చీకట్లోనే చాలా మంది స్వైరవిహారం
ముసుగుల్లో చూపుతారు సాహసవిన్యాసం
గూఢమైన కుతిరాతల్లో కృత్రిమ ఆనందం 
తెలియని కూడని కాపేక్ష రతి ఆస్వాదం!

Friday, 19 January 2018

అంతర్మధనం

తెలియని తహతహలతో లోలోన అంతరాయం
జవాబులు ఇవ్వలేని చిక్కుప్రశ్నలతో ఆరాటం 
మనసు అలజడులతో చెప్పలేని నిస్సహాయత 
అక్షర స్వరములై నిలచెనే భావ అంతర్మధనం!