Saturday, 8 August 2015

తర్వాత



అతుకువేస్తున్నా హృదయాన్ని విరిగిన  తర్వాత
నేను నవ్వుతున్నా వెక్కి వెక్కి ఏడ్చిన తర్వాత
నీపై వలపని తెలిసె నువ్వు దూరమైన తర్వాత
నిన్ను నాలో వెతుకుతున్నా నేనే నీవైన తర్వాత

Wednesday, 5 August 2015

అడగనా?


ఏమీ అనుకోనంటే ఒకటి అడగాలని ఉంది...
ప్రేమించడం నావద్ద నేర్చి...ఎవరిని ప్రేమిస్తున్నావని!
అడిగానని మరో కొత్తనేరాన్ని నాపై మోపకు...
నిన్ను ప్రేమించిన నేరానికి శిక్షే ఇంకా పూర్తికాలేదు!

Sunday, 19 July 2015

ఒక కవిత



 లెక్కించి అక్షరాలు కాగితం పై ఖననం చేస్తే
ఒక కవిత ఏదో కనులు తెరిచి చూసింది...
ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తే
లెక్కలేనన్ని అలోచనల్లో చిక్కాను అన్నది!

Monday, 6 July 2015

లేదు-రాదు



నిజాలు గ్రహించక ఆలోచించి లాభంలేదు
అవసరాల కోసం జీవించడంలో అర్థంలేదు
ప్రయత్నం చేయకనే ఫలితం ఆశించరాదు
పడిన ప్రతిచినుకూ స్వాతిముత్యమైపోదు

Saturday, 27 June 2015

ఆశలు

కలలో అయినా తీరకున్న కోరికలు
జీవితాన్న ఆశలు ఎగసిపడే అలలు
నచ్చిన భావాలే హోరు పెడుతుంటే
రాగంతో మనసు పాడుతున్న గీతాలు

Monday, 8 June 2015

ప్రేమ

నాలోని ప్రేమని మాటల్లో చెప్పలేనప్పుడు
అక్షరాల్లో వ్రాసి చూపమంటే ఏం చూపను
అందులో ఇమిడే ప్రేమకాదని ఎలాచెప్పను
చెప్పలేదని ప్రేమలేదంటే ఏమని అనను??

Tuesday, 2 June 2015

అంచనా

నా అక్షరాల ద్వారా అంచనా వేయకండి
నా స్వరూపాన్ని నిండైన నా స్వభావాన్ని
మీ అస్థిత్వం మాసిపోయేను వెతకివేసారి
మీ భావాలే మారిపోవు నిజాలను గాంచి