Tuesday, 30 December 2014

జీవనం



ఎల్లవేళలా వడ్డించిన విస్తరి కాదు జీవితం
ఆకలిని అధికమించి సాగించాలి పయనం
ఎప్పుడూ నీవు మెచ్చిన రాగమే అడగనేల
తాళానికి అనుగుణంగా నర్తించడమే జీవనం

Tuesday, 23 December 2014

తోడు



ఒంటరిగా నువ్వు ఉంటే
తోడుగా వెంటరాని జనం
వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు
నీ తోడు కావాలని కోరతారు!

Monday, 15 December 2014

జ్ఞానం

బాదాంపప్పు తింటేకాదు జ్ఞానం పెరిగేది
జీవితంలో ఎదురుదెబ్బలు తింటే వస్తుంది
ఉన్నది ఉన్నట్లు చెబితే ఇలాగే ఉంటుంది
మసిపూసి మాయచేస్తే లోకం మెచ్చుతుంది

Monday, 8 December 2014

నిజాలు


నిజాలని నిర్భయంగా చెప్పే నేను

కాకున్నా కటువుగానే కనబడతాను!

కావాలంటే తీయగా మాట్లాడగలను

మాట్లడితే అబధ్ధాలకోరుని అవుతాను!