అందం కావాలంటే బాహ్య రూపం చూడు
మనిషివి అయితే మనసును చూడు...
మానవత్వం కావాలంటే మంచిని పంచు
మంచి మానవత్వం కలిపితే దేవుడు చూడు
అందం కావాలంటే బాహ్య రూపం చూడు
మనిషివి అయితే మనసును చూడు...
మానవత్వం కావాలంటే మంచిని పంచు
మంచి మానవత్వం కలిపితే దేవుడు చూడు
నేను నీకోసం నీరునై పారుతున్నా
నీ దాహం తీర్చే సెలయేరునై ఉన్నా
ప్రతి గుమ్మం గడపా నిన్ను వెతికాను
ఎప్పటికి అంతమయ్యేనో నా ఈ అన్వేషణ
నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు
దిగులుపడి హైరానా పడకెప్పుడు
నిన్ను వీడడు మరువడు నీవాడు
నీకు తోడు నీడా నీ జతగాడు..
ఒక్కొక్క అనుభవం ఒకో గడి అయి
కూర్చబడిన చదరంగమే ఈ జీవితం
ఆలోచించి ఆచితూచి అడుగెయ్యాలి
ఏ గడి మరచినా చదరంగంలో గెలవం!