కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!
ఒరేయ్ వెర్రివాడా నువ్వు నన్నేం మోసగించగలవు కళ్ళలో చూసి మాట్లాడలేక ముఖం దించుకుంటావు నా సమాధి దగ్గరకి వచ్చి చితికి నిప్పు అంటించబోకు అపరిపక్వతతో నీ చేతుల్ని నీవేకాల్చుకుని ఏడ్చేవు!