Friday, 24 February 2017

నవ్వు

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనుకుంటాను
నవ్వుకి ప్రతిఫలంగా ఆనందం కావాలంటాను 
పెదాల సహకారం కళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని 
ఇక బాధలకు విడాకులు ఇచ్చి నవ్వేస్తుంటాను.   

Tuesday, 14 February 2017

మరపు

పదాలు  పరిచయాలు గుర్తు రావడంలేదు
నిన్ను వలచినాక శ్వాసే గుర్తుండడంలేదు 
నీ సాంగత్యంలో ఉండి నిను వీడి వస్తుంటే
నన్ను నీ చెంతనే వదలి మరచిపోయాను!  

Monday, 9 January 2017

వదిలెయ్

సమయం దొరికినప్పుడు 
పగప్రతీకారాలని పాతిపెట్టేయండి
ఏమో ఎవరు చెప్పొచ్చారు 
శ్వాసించే సమయం ఎప్పటివరకో!

Tuesday, 20 December 2016

శిక్ష

శిక్ష తగ్గించడం సబబేనేమో కదా..
పుట్టుకతో నేరస్తులు ఎవరూ కారు
ధ్వేషించేవారి ప్రేమించడం నేరం కాదు 
మనసిస్తే మరణం మార్గం కాకూడదు!

Saturday, 3 December 2016

దారులు

దారులు వేరైతే అడుగుజాడల్లో నడచేం సాధించాలి
అప్పుడు దగ్గరై దూరం ఇప్పుడు దూరమే దూరం
నిరీక్షించి నీరసించి విచారపడి చేసేది ఏమి ఉన్నది   
అప్పుడు ధ్యాసలో ఇప్పుడు శ్వాసపీలుస్తు గడపాలి 

Wednesday, 12 October 2016

బ్రతుకు

సత్యం విలువ తెలుసుకుని బ్రతికితే
జీవితం అంతా ఆనందంగా ఉండవచ్చు!
అసత్యాన్ని క్షణిక సుఃఖానికై ఖర్చుపెడితే
జీవితమంతా రుసుం కడుతూ బ్రతకాలి!

Wednesday, 21 September 2016

జరుగుబాటు

కోరగానే పూలు రాలి పడవు ఒళ్ళో
కర్మ అనే కొమ్మని కుదిపి రాల్చాలి..
చీకటికి బుజ్జగిస్తే వెలుగు వచ్చిపడదు
వెలుగుకై దీపం వెలిగించుకోక తప్పదు!