Sunday, 28 September 2014

విజయం

అటో ఇటో అనుకున్న వారే విజేతలవుతారు
మధ్యలో ఊగిసలాడేవారు ఊగుతూ ఉంటారు
కోరికల్ని జయించి కర్తవ్యాన్ని పాలించేవారు
ఎప్పటికీ క్రిందకి జారక శిఖరాగ్రాన్నే ఉంటారు

Tuesday, 9 September 2014

నా పిచ్చిరాతలు

ఏం రాయను మనసు భాషరాని దానను
ఏదేదో చెప్పాలి అనుకుంటాను చెప్పలేను
అక్షరాలు కరుణిస్తే  అందంగానే రాస్తాను
ఏదో రాసానని చదవడం మానరనుకుంటాను


Monday, 1 September 2014

మాలోకం

అనుబంధాలు వాటంతట అవి ఎప్పుడూ చావవు
స్వార్థం, అజ్ఞానం, అహం, వాటిని హత్యచేస్తాయి
కనులుతెరిచి  బ్రతుకుదామంటే ఏడిపించే లోకం
కనులుమూస్తే ఏడుస్తుందెందుకో వెర్రి మాలోకం!

Wednesday, 13 August 2014

నవ్వాలి

జీవితం ఒక అందమైన కల
జీవించాలన్న జిజ్ఞాస ఉండాలి
భాధలే బానిసలయ్యే వలవేయాలి
నిండుగా నవ్వే నేర్పు మనకుండాలి

Wednesday, 30 July 2014

ఏంచేయలేం

మదిలోని ప్రతి భావనికి భాష్యం చెప్పలేం
ఆశపడ్డ ప్రతి కోరిక తీర్చమని మ్రొక్కలేం
పెదవులతో నవ్వేస్తూ  కన్నీటిని దాచలేం
మూర్ఖుల మనసెన్నటికీ రంజింపజేయలేం

Wednesday, 2 July 2014

గొప్ప

విజయమెన్నడూ గొప్పదికాదు
అది సాధించినవాళ్ళు గొప్పవారు
మనుషుల మధ్య వారధి గొప్పకాదు
దాన్ని తొలగించినవాళ్ళు గొప్పవాళ్ళు