దారులు వేరైతే అడుగుజాడల్లో నడచేం సాధించాలి అప్పుడు దగ్గరై దూరం ఇప్పుడు దూరమే దూరం నిరీక్షించి నీరసించి విచారపడి చేసేది ఏమి ఉన్నది అప్పుడు ధ్యాసలో ఇప్పుడు శ్వాసపీలుస్తు గడపాలి
కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!
ఒరేయ్ వెర్రివాడా నువ్వు నన్నేం మోసగించగలవు కళ్ళలో చూసి మాట్లాడలేక ముఖం దించుకుంటావు నా సమాధి దగ్గరకి వచ్చి చితికి నిప్పు అంటించబోకు అపరిపక్వతతో నీ చేతుల్ని నీవేకాల్చుకుని ఏడ్చేవు!
నా అనేక వైఫల్యాలను పక్కకు త్రోసి నన్ను ఉన్నతస్థాయిలో ఊహించి నన్ను నన్నుగా ఇష్టాపడే వారిలో నాకు కనిపించేది పరమాత్ముడే తప్ప ఈర్ష్య ధ్వేషాలతో రగిలే మనిషి కాదు