Sunday, 12 June 2016

చేతకాదు

ఒరేయ్ వెర్రివాడా నువ్వు నన్నేం మోసగించగలవు
కళ్ళలో చూసి మాట్లాడలేక ముఖం దించుకుంటావు
నా సమాధి దగ్గరకి వచ్చి చితికి నిప్పు అంటించబోకు
అపరిపక్వతతో నీ చేతుల్ని నీవేకాల్చుకుని  ఏడ్చేవు!

Saturday, 9 April 2016

అద్దం

నా ప్రతీ పలుక్కీ ప్రతిబింబం నేనౌతా
చేసిన తప్పుని అద్దంలో చూసుకుంటా
అద్దాన్ని చిన్నదిగా చేసి నేను పెద్దగా
కనబడలేను అందుకే తప్పు దిద్దుకుంటా!

Wednesday, 16 March 2016

ప్రేమించు



జీవితంలో ప్రేమించాలి అనుకుంటే
నీ బాధల్ని నీవు అమితంగా ప్రేమించు
ఎందుకంటే...సాధారణంగా మనం ప్రేమించినవి
ఏవీ కూడా ఎక్కువ కాలం మనతో ఉండవు, దక్కవు.

Wednesday, 17 February 2016

ఈర్ష్య


నా అనేక వైఫల్యాలను పక్కకు త్రోసి
నన్ను ఉన్నతస్థాయిలో ఊహించి
నన్ను నన్నుగా ఇష్టాపడే వారిలో
నాకు కనిపించేది పరమాత్ముడే తప్ప
ఈర్ష్య ధ్వేషాలతో రగిలే మనిషి కాదు

Friday, 8 January 2016

పర్యవసానం



కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!

Wednesday, 23 December 2015

సత్యం

సత్యం విలువ తెలుసుకుని ఉపయోగిస్తే
జీవితం అంతా ఆనందంగా ఉండవచ్చు!
అసత్యాన్ని క్షణిక సుఃఖానికై ఖర్చుపెడితే
జీవితాంతం రుసుం కడుతూ బ్రతుకవచ్చు!

Thursday, 10 December 2015

కొత్తపేజీ


మజిలీ చేరే లోపునే మలుపులెన్నో...

పేజీ తిప్పబోతే వెనుకపేజీలో అక్షరాలెన్నో

వ్రాయబోతే ముందు కొత్తపేజీ ఖాళీ ఖాళీగా

సరళ సమాంతర గీతలు నిలువుగా అడ్డంగా