లోపల గుచ్చుతున్నాయి కొన్ని గాజుముక్కలు వలపు వ్యామోహంలో వేసినవా వెర్రి గెంతులు ప్రేమ వలలో చిక్కి విరిగిన మనసు ముక్కలు వయసు ఉనికి ఉరికి చిక్కిన వారు దోషులు..
ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనుకుంటాను నవ్వుకి ప్రతిఫలంగా ఆనందం కావాలంటాను పెదాల సహకారం కళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని ఇక బాధలకు విడాకులు ఇచ్చి నవ్వేస్తుంటాను.
దారులు వేరైతే అడుగుజాడల్లో నడచేం సాధించాలి అప్పుడు దగ్గరై దూరం ఇప్పుడు దూరమే దూరం నిరీక్షించి నీరసించి విచారపడి చేసేది ఏమి ఉన్నది అప్పుడు ధ్యాసలో ఇప్పుడు శ్వాసపీలుస్తు గడపాలి