Monday, 10 February 2014

కోరిక

నిన్నేం కోరనులే...
ఒక చిన్ని కోరిక తప్ప
నేను తలచిన ప్రతిసారి
నన్ను తాకి పలకరించి పో!

Wednesday, 29 January 2014

తెలిసింది

నిన్ను ప్రేమించడం మొదలెట్టాకే
లోకం అందంగా కనిపించసాగింది
నీప్రేమ జడివానజల్లులో తడిసాకే
తనువుకి తపన ఏమిటో తెలిసింది

Sunday, 26 January 2014

ఏమిటో?

నేను అతని ప్రేమని పొందనేలేదు
ఇంక మరి కోల్పోవడం ఏమిటో??


Tuesday, 7 January 2014

మరిచా

చేయవలసిన పనులు ఎన్నో మరచిపోయాను
ప్రేమను వెల్లడించడం పనిలో పనిగా మరిచాను

Thursday, 2 January 2014

తెంచు

నన్ను నమ్మి నాగురించి చర్చించు
నా పై ఉన్న ప్రేమ ఎంతో వివరించు
నీవు లేని నా జీవితాన్ని ఊహించు
శిక్ష ఎంతకాలమని సంకెళ్ళు తెంచు

Monday, 30 December 2013

కల

కలలలో నీవు కాక నీలో కలలని జీవించనీయి
అందం ముఖానికి కాక ప్రేమించే మదికందీయి
ప్రేమ ఫలించి చీకటిదారిలో వెలుగు చూపనీయి