నా ప్రేమలో మునిగిపోయి నువ్వు ప్రసిద్ధి చెందావే కానీ లేకపోతే నలుగురిలో నీవెన్నాడూ చర్చనీయాంశం కావు నాకంటూ ఒక తోడుకై నా చూపులెన్నో దారులు వెతికింది ఆ తీరని కోరికేదో జీవితాంతం నన్ను బాటసారిని చేసింది!!
మట్టిలో పూడ్చిపెడితే తెలిసింది మమకారమేదో మమతలెరుగనివారు సైతం కన్నీరు కార్చెదరని చచ్చినవాడి కళ్ళు చాటంత విశాలం అయినవని మనిషి చచ్చిపోతేనే మంచి బ్రతికి బట్టకట్టగలదని