Monday, 28 September 2015

కళ్ళజోడు


అడుగు క్రింద ఆరడుగుల భూమి నీది కాదు
తెలిసి కూడా,  నిజం అని చెబితే నమ్మవు
చీకటే చుట్టి ఉన్నా వెలుగురేఖల్ని చూడమని
అబద్ధాన్ని చత్వారమంటూ కళ్ళజోడుగా వాడేవు

Saturday, 12 September 2015

ఏం??



వలపుబాణాలు విసురుగా వేసి ఏం సాధిస్తావు
ఊపిరాడక వలపుగదిలో ఉక్కిరి బిక్కిరయ్యేవు
రిక్తహస్తాలని అందుకుంటే నిరాశతో నిట్టూర్చేవు
పొందలేక నల్లబడ్డ ప్రేమకి మెరుగులెన్నో దిద్దేవు

Saturday, 29 August 2015

అబధ్ధం


జీవితం ఒక అందమైన అబధ్ధం
అందుకే దాన్ని అందరూ కోరుకుంటారు!
మృత్యువు భరించలేని చేదు నిజం
అందుకే దాన్ని ఎవ్వరూ కావాలనుకోరు!

Friday, 21 August 2015

అంతటా నేనే

అంతటా నేనే కనబడుతున్నానని
కనపడిన ప్రతికన్యకీ కన్ను కొట్టేసి
అమాయకంగా లవ్ యూ చెప్పేసి
కొంగట్టుకుని తిరుగుతున్నాననకు!

Saturday, 8 August 2015

తర్వాత



అతుకువేస్తున్నా హృదయాన్ని విరిగిన  తర్వాత
నేను నవ్వుతున్నా వెక్కి వెక్కి ఏడ్చిన తర్వాత
నీపై వలపని తెలిసె నువ్వు దూరమైన తర్వాత
నిన్ను నాలో వెతుకుతున్నా నేనే నీవైన తర్వాత

Wednesday, 5 August 2015

అడగనా?


ఏమీ అనుకోనంటే ఒకటి అడగాలని ఉంది...
ప్రేమించడం నావద్ద నేర్చి...ఎవరిని ప్రేమిస్తున్నావని!
అడిగానని మరో కొత్తనేరాన్ని నాపై మోపకు...
నిన్ను ప్రేమించిన నేరానికి శిక్షే ఇంకా పూర్తికాలేదు!

Sunday, 19 July 2015

ఒక కవిత



 లెక్కించి అక్షరాలు కాగితం పై ఖననం చేస్తే
ఒక కవిత ఏదో కనులు తెరిచి చూసింది...
ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తే
లెక్కలేనన్ని అలోచనల్లో చిక్కాను అన్నది!