Wednesday, 23 December 2015

సత్యం

సత్యం విలువ తెలుసుకుని ఉపయోగిస్తే
జీవితం అంతా ఆనందంగా ఉండవచ్చు!
అసత్యాన్ని క్షణిక సుఃఖానికై ఖర్చుపెడితే
జీవితాంతం రుసుం కడుతూ బ్రతుకవచ్చు!

Thursday, 10 December 2015

కొత్తపేజీ


మజిలీ చేరే లోపునే మలుపులెన్నో...

పేజీ తిప్పబోతే వెనుకపేజీలో అక్షరాలెన్నో

వ్రాయబోతే ముందు కొత్తపేజీ ఖాళీ ఖాళీగా

సరళ సమాంతర గీతలు నిలువుగా అడ్డంగా

Thursday, 26 November 2015

అంతలా


మరీ అంతలా నిరీక్షింపజేయకు

కాలమిచ్చే తీర్పునే నిందించేలా

నువ్వు తిరిగి వచ్చి చూసేసరికి

మౌనంగా నాశ్వాస ఆగిపోయేలా!

Friday, 6 November 2015

కల


క్షణ క్షణం నీమీదే నా ఆలోచనలన్నీ

ఒక్కక్షణమైనా నాతోడు నీవుండాలని

నీ ధ్యాసలోనే గడిచాయి కోట్లక్షణాలన్నీ

చూసా ఓక్షణం, కానీ తెలిసె అది కలని

Tuesday, 13 October 2015

నిజం



జీవితం ఒక అందమైన అబధ్ధం
అందుకే దాన్ని అందరూ కోరుకుంటారు..
మృత్యువు భరించలేని చేదు నిజం
అందుకే దాన్ని ఎవ్వరూ కావాలనుకోరు!

Monday, 28 September 2015

కళ్ళజోడు


అడుగు క్రింద ఆరడుగుల భూమి నీది కాదు
తెలిసి కూడా,  నిజం అని చెబితే నమ్మవు
చీకటే చుట్టి ఉన్నా వెలుగురేఖల్ని చూడమని
అబద్ధాన్ని చత్వారమంటూ కళ్ళజోడుగా వాడేవు

Saturday, 12 September 2015

ఏం??



వలపుబాణాలు విసురుగా వేసి ఏం సాధిస్తావు
ఊపిరాడక వలపుగదిలో ఉక్కిరి బిక్కిరయ్యేవు
రిక్తహస్తాలని అందుకుంటే నిరాశతో నిట్టూర్చేవు
పొందలేక నల్లబడ్డ ప్రేమకి మెరుగులెన్నో దిద్దేవు