Wednesday, 5 November 2014

సాహాసం



ఇసుకరేణువులు వంటిది ఒక జీవితం..
గాజుముక్కలతో ఎందుకనో ఈ సావాసం
పట్టుకుంటే జారి ముట్టుకుంటే గుచ్చుకుని
అయినా కలిసి ప్రయాణం వృధా సాహాసం!

Wednesday, 29 October 2014

నీది నాది



కొందరు ఇది నీదంటారు
కొందరు కాదు నాదంటారు
మరికొందరు నీదంతా నాదంటారు
నిజానికి ఏదీ నీది కాదు నాది కాదు

Friday, 24 October 2014

ఒక పరీక్షే



కష్టాలకి భయపడి పారిపోవడం సులభం
జీవితాన్ని పరికిస్తే ప్రతిక్షణం ఒక పరీక్షే...
పిరికివారు జీవితంలో ఏమీ సాధించలేరు
పోరాడేవారి పాదాల చెంతనే పట్టుపరుపు.

Saturday, 18 October 2014

జీవితంలో



జీవితంలో.....
వెనుదిరిగి చూస్తే "అనుభవం" లభిస్తుంది
ముందుగా యోచిస్తే "ఆశ" అగుపిస్తుంది
కుడి-ఎడమలు చూస్తే "నిజం" తెలుస్తుంది
మనలో మనం చూస్తే "పరమాత్మ" కనిపిస్తుంది!

Sunday, 5 October 2014

ఆశలపందిళ్ళు

నిన్ను నువ్వు మెచ్చుకుంటూ సాగిపో...
నీ గురించి చెడు చెప్పేవారు కోకొల్లలున్నారు!!
ఆశలపందిళ్ళు అందరూ అల్లుకుంటూనే ఉంటారు
పూర్తయ్యేవి మాత్రం అదృష్టం అచ్చి వచ్చినవారిదే!

Sunday, 28 September 2014

విజయం

అటో ఇటో అనుకున్న వారే విజేతలవుతారు
మధ్యలో ఊగిసలాడేవారు ఊగుతూ ఉంటారు
కోరికల్ని జయించి కర్తవ్యాన్ని పాలించేవారు
ఎప్పటికీ క్రిందకి జారక శిఖరాగ్రాన్నే ఉంటారు

Tuesday, 9 September 2014

నా పిచ్చిరాతలు

ఏం రాయను మనసు భాషరాని దానను
ఏదేదో చెప్పాలి అనుకుంటాను చెప్పలేను
అక్షరాలు కరుణిస్తే  అందంగానే రాస్తాను
ఏదో రాసానని చదవడం మానరనుకుంటాను