Saturday, 19 August 2017

వేదన

వెంటాడుతున్న జ్ఞాపకాలు
దూరమైన అనుబంధము
వినిపించదు విరహవేదన  
ఆలాపిస్తుంది ఆత్మరోదన! 

Saturday, 5 August 2017

ప్రయాస

కనులనిండా నీరు పెదవులపై నవ్వు
ఆనందాన్ని నటిస్తూ జీవిస్తున్నా..
ఇలాంటివారి కోసం ఎదురుచూస్తున్నా
విరిగిన మనసు అతికే వైద్యం వెతుకుతున్నా!

Tuesday, 18 July 2017

జీవితసారాంశం

నీటిప్రవాహంలో ఇసుకరేణువులు కనబడ్డం
కనులు మనల్ని మోసం చేయడం ఒకటే
ధ్యేయాలు కూడా తమ దిశను మార్చేను
ఇదేనేమో జీవితపు అసల్సిసలైన సారాంశం

Tuesday, 20 June 2017

తెలిసె

లోకం వెలిగితే తెలిసె నువ్వు నవ్వావని
వనం వికసించితే తెలిసె నువ్వు వచ్చావని
తనువు తడైతే తెలిసె నువ్వు తడిమావని 
మనసు చెమరిస్తే తెలిసె నువ్వు చూసావని!

Monday, 5 June 2017

తరుణం

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

Friday, 12 May 2017

కరుణ

నీవు లేక నేను శ్వాస కూడ తీయలేను
గుండె నిండుగా గూడుకట్టి ఉన్నది నీవే
నీవు దరిలేక మనసున విరహం పెరిగెనే
కాలం కఠినమైన నీవు కరుణ చూపరాదా!

Wednesday, 26 April 2017

వేడుక

వ్యధలను వేడుకతో వ్రాస్తూ..
నిట్టూర్పులను నిద్రపుచ్చాను!
జనం వాటిని చదువుకుని..
ఆహా ఓహో అంటే మురిసాను!