Tuesday, 20 June 2017

తెలిసె

లోకం వెలిగితే తెలిసె నువ్వు నవ్వావని
వనం వికసించితే తెలిసె నువ్వు వచ్చావని
తనువు తడైతే తెలిసె నువ్వు తడిమావని 
మనసు చెమరిస్తే తెలిసె నువ్వు చూసావని!

Monday, 5 June 2017

తరుణం

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

Friday, 12 May 2017

కరుణ

నీవు లేక నేను శ్వాస కూడ తీయలేను
గుండె నిండుగా గూడుకట్టి ఉన్నది నీవే
నీవు దరిలేక మనసున విరహం పెరిగెనే
కాలం కఠినమైన నీవు కరుణ చూపరాదా!

Wednesday, 26 April 2017

వేడుక

వ్యధలను వేడుకతో వ్రాస్తూ..
నిట్టూర్పులను నిద్రపుచ్చాను!
జనం వాటిని చదువుకుని..
ఆహా ఓహో అంటే మురిసాను!  

Wednesday, 15 March 2017

దోషులు

లోపల గుచ్చుతున్నాయి కొన్ని గాజుముక్కలు 
వలపు వ్యామోహంలో వేసినవా వెర్రి గెంతులు 
ప్రేమ వలలో చిక్కి విరిగిన మనసు ముక్కలు  
వయసు ఉనికి ఉరికి చిక్కిన వారు దోషులు..

Friday, 24 February 2017

నవ్వు

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనుకుంటాను
నవ్వుకి ప్రతిఫలంగా ఆనందం కావాలంటాను 
పెదాల సహకారం కళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని 
ఇక బాధలకు విడాకులు ఇచ్చి నవ్వేస్తుంటాను.   

Tuesday, 14 February 2017

మరపు

పదాలు  పరిచయాలు గుర్తు రావడంలేదు
నిన్ను వలచినాక శ్వాసే గుర్తుండడంలేదు 
నీ సాంగత్యంలో ఉండి నిను వీడి వస్తుంటే
నన్ను నీ చెంతనే వదలి మరచిపోయాను!