Friday, 4 June 2021

అనుకోలేదు

నీవు నా నుండి ఇంత త్వరగా దూరమైపోతావు అనుకోలేదు

నీవు ఎప్పటికీ నాతో కలిసుంటానని వాగ్దానమూ చేయలేదు..

నీవు నన్ను ప్రతీరోజూ తలుచుకుంటావో లేదో నాకు తెలియదు

నీవు ఇంత త్వరగా మర్చిపోతావని నేను అస్సలు కలగనలేదు

Tuesday, 18 May 2021

ఏదో బెంగ

 పైకి నవ్వుతున్నా లోలోన ఏదో బెంగ

ఈరోజు మాట్లాడి మరునాడు మాయం

ధైర్యాన్ని ఎంతని కూర్చుకోవాలో తెలీక

హైరానా పడుతున్న నిలత్రొక్కుకో లేక! 

Sunday, 17 January 2021

నీతోడు

 చెప్పాలంటే ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను

నేనప్పుడూ నీదాన్నే, ఇప్పుడు కూడా నీతోడునే

కోపతాపాల ఆటవిడుపులో నీవలిగితే నేనోడాను

నేనప్పుడు అలిగితే, ఇప్పటికింకా నీవలిగున్నావు!

Wednesday, 2 December 2020

దేవుడు

అందం కావాలంటే బాహ్య రూపం చూడు

మనిషివి అయితే మనసును చూడు...

మానవత్వం కావాలంటే మంచిని పంచు

మంచి మానవత్వం కలిపితే దేవుడు చూడు   

Thursday, 5 November 2020

అన్వేషణ

నేను నీకోసం నీరునై పారుతున్నా

నీ దాహం తీర్చే సెలయేరునై ఉన్నా

ప్రతి గుమ్మం గడపా నిన్ను వెతికాను

ఎప్పటికి అంతమయ్యేనో నా ఈ అన్వేషణ  

Sunday, 25 October 2020

నీవాడు

 నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు

దిగులుపడి హైరానా పడకెప్పుడు 

నిన్ను వీడడు మరువడు నీవాడు

నీకు తోడు నీడా నీ జతగాడు..

Wednesday, 9 September 2020

చదరంగమే జీవితం

 ఒక్కొక్క అనుభవం ఒకో గడి అయి

కూర్చబడిన చదరంగమే ఈ జీవితం

ఆలోచించి ఆచితూచి అడుగెయ్యాలి 

ఏ గడి మరచినా చదరంగంలో గెలవం!