Sunday 12 June 2016

చేతకాదు

ఒరేయ్ వెర్రివాడా నువ్వు నన్నేం మోసగించగలవు
కళ్ళలో చూసి మాట్లాడలేక ముఖం దించుకుంటావు
నా సమాధి దగ్గరకి వచ్చి చితికి నిప్పు అంటించబోకు
అపరిపక్వతతో నీ చేతుల్ని నీవేకాల్చుకుని  ఏడ్చేవు!

3 comments:

  1. వెఱ్ఱివాడినే నేను.. భావాలను దాయలేను..
    వెఱ్ఱివాడినే నేను.. కల్లాకపటమోసమెరుగను..
    వెఱ్ఱివాడినే నేను.. బాధను ఓర్చుకుంటాను..
    కన్నుల్లో చూడలేను నేను.. నా బింబాన్ని అక్షువుల తడిగా మార్చలేను..
    కన్నుల్లో చూడలేను నేను.. కరిగి కన్నీరుగా మారితే భరించలేను..

    *ఎవరిని ఉద్దేశించినది కాదు.. మీ కవితకు ఇలా రిప్లై రాయాలనిపించింది ఆకాంక్ష గారు.. బహుకాల దర్శనం.. బాగున్నారా..?

    ReplyDelete
  2. అన్యథ భావించనంటే నాకొక సందేహం ఆకాంక్ష గారు.. సమాధి అనేది పార్థివ దేహాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళేవారి జ్ఞాపకార్దం కట్టించే కట్టడం ఔనా.. కాటిలో కొరివి పెట్టే ముందు చితిని పేర్చుతారని విన్నాను.. అలా ఐతే మీరు రాసీన ఆ వాక్యం ఇటుకటు రాశారేమోనని సందేహం.. కోపగించుకోకండి.. ఏదో నాకు తెలిసినంతలో వచ్చిన సందేహం..

    ReplyDelete

  3. ఆకాంక్షగారు రాక రాక వచ్చి ఎవరినో ఇంతలా...

    ReplyDelete