Thursday 25 January 2018

కుతి..

చీకట్లోనే చాలా మంది స్వైరవిహారం
ముసుగుల్లో చూపుతారు సాహసవిన్యాసం
గూఢమైన కుతిరాతల్లో కృత్రిమ ఆనందం 
తెలియని కూడని కాపేక్ష రతి ఆస్వాదం!

6 comments:

  1. తామసానికి దాసోహం అయినవారి మానసిక పరిపక్వత లోపం
    సమాజ హేతువాదానికి ఎందుకు ఇస్తారో తెలియదు తిలోదకం
    బాహ్య సౌందర్యం కంటే వేల రెట్లు అధికం అంతః సౌందర్యం
    తెలియక మానవత్వం మరిచి ప్రలోభ పెట్టి తమకు తాము తవ్వుకుంటారు కూపం

    ఆకాంక్ష గారు.. మీరు రాసిన కవితలో కొన్ని పదాలకి అర్థాలు నాకు తెలియవు.. తామసంధకారం కృత్రిమానందం అనే పదాలను వాడుకుని మీ ఈ కవితకు వ్యాఖ్యానించాను.. విచిత్రం ఏమంటే కవిత శీర్షిక పదానికీ నాకు అర్థం తెలియదు.. మీ ఈ కవిత హెచ్చరిక మోడ్ లో ఉందని తెలిసి ఇలా.. తప్పైతే క్షమించేసేయండి.. భారత రాజ్యాంగ దీనోత్సవ శుభాభినందనలు మీకు.

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారు నాకు తెలిసి కుతి అంటే కోరిక జిహ్వ అన్న అర్థంతో వ్రాసాను.

      Delete
    2. సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు ఆకాంక్ష గారు

      Delete

  2. వావ్...కొత్త పదాల హోరు ఆకాంక్షగారు.

    ReplyDelete
  3. కుతి తీరలేదు అంటే ఇదేనేమో.

    ReplyDelete