Friday, 4 June 2021

అనుకోలేదు

నీవు నా నుండి ఇంత త్వరగా దూరమైపోతావు అనుకోలేదు

నీవు ఎప్పటికీ నాతో కలిసుంటానని వాగ్దానమూ చేయలేదు..

నీవు నన్ను ప్రతీరోజూ తలుచుకుంటావో లేదో నాకు తెలియదు

నీవు ఇంత త్వరగా మర్చిపోతావని నేను అస్సలు కలగనలేదు

Tuesday, 18 May 2021

ఏదో బెంగ

 పైకి నవ్వుతున్నా లోలోన ఏదో బెంగ

ఈరోజు మాట్లాడి మరునాడు మాయం

ధైర్యాన్ని ఎంతని కూర్చుకోవాలో తెలీక

హైరానా పడుతున్న నిలత్రొక్కుకో లేక! 

Sunday, 17 January 2021

నీతోడు

 చెప్పాలంటే ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను

నేనప్పుడూ నీదాన్నే, ఇప్పుడు కూడా నీతోడునే

కోపతాపాల ఆటవిడుపులో నీవలిగితే నేనోడాను

నేనప్పుడు అలిగితే, ఇప్పటికింకా నీవలిగున్నావు!

Wednesday, 2 December 2020

దేవుడు

అందం కావాలంటే బాహ్య రూపం చూడు

మనిషివి అయితే మనసును చూడు...

మానవత్వం కావాలంటే మంచిని పంచు

మంచి మానవత్వం కలిపితే దేవుడు చూడు   

Thursday, 5 November 2020

అన్వేషణ

నేను నీకోసం నీరునై పారుతున్నా

నీ దాహం తీర్చే సెలయేరునై ఉన్నా

ప్రతి గుమ్మం గడపా నిన్ను వెతికాను

ఎప్పటికి అంతమయ్యేనో నా ఈ అన్వేషణ  

Sunday, 25 October 2020

నీవాడు

 నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు

దిగులుపడి హైరానా పడకెప్పుడు 

నిన్ను వీడడు మరువడు నీవాడు

నీకు తోడు నీడా నీ జతగాడు..

Wednesday, 9 September 2020

చదరంగమే జీవితం

 ఒక్కొక్క అనుభవం ఒకో గడి అయి

కూర్చబడిన చదరంగమే ఈ జీవితం

ఆలోచించి ఆచితూచి అడుగెయ్యాలి 

ఏ గడి మరచినా చదరంగంలో గెలవం!

Wednesday, 20 May 2020

వాడకం..

వాడని ఇనుము తుప్పుపడుతుంది
కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది
బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది..
అందుకే ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండండీ 

Thursday, 25 April 2019

అవసరం

చెప్పేది ముందు వినడం
వివేకంతో జవాబివ్వడం
ప్రశాంతంగా ఆలోచించడం
నిదానంగా నిర్ణయం తీసుకోవడం
మనిషికి ఎంతో అవసరం

Tuesday, 29 January 2019

ఆడమగ

మాయచేసి మంత్రం వేసేది ఆడువారు
బలం చూపి బలత్కరించేది మగవారు
ఇలా సరిపోయె కదా ఇరువురికీ జోడి
భగవంతుడు వేసెనాయె ఆడమగ బేడీ 

Friday, 14 December 2018

ఎక్కువ

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ…
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ…
ఇష్టంతోచేసే పనులకు విజయాలు ఎక్కువ…
అందరిలో మంచినే చూస్తే ప్రశాఒతత ఎక్కువ!

Tuesday, 4 December 2018

కావాలి

నాకూ కావాలి పరిగెత్తించే నాదైన ఒక్కక్షణం
నాకూ కావాలి ఎదమూలల్లో దాగిన పరిమళం
నాకూ కావాలి నేను తాకాలనుకున్న ఆకాశం
నాకూ కావాలి కప్పుకునే ఆశలరెక్కలు దుప్పటి

Friday, 6 July 2018

కునుకు

మధ్య రాత్రిదాటి చాలసేపయ్యింది
దాదాపు లోకం నిద్రపోతుంది
కంటికి కునుకు మాత్రం రాకుంది
మెదడు పనికి మనసు జాలిపడింది

Thursday, 22 February 2018

ఆశ


రెక్కలు విప్పిన మనసుని రెచ్చగొట్టి
ప్రేమాభిమానాలు ఇంధనంగా నింపి 
ఆకాశానికి అర్రులు ఆశగా చూసాను 
గమ్యం అగుపించక అల్లాడుతున్నాను!

Thursday, 25 January 2018

కుతి..

చీకట్లోనే చాలా మంది స్వైరవిహారం
ముసుగుల్లో చూపుతారు సాహసవిన్యాసం
గూఢమైన కుతిరాతల్లో కృత్రిమ ఆనందం 
తెలియని కూడని కాపేక్ష రతి ఆస్వాదం!

Friday, 19 January 2018

అంతర్మధనం

తెలియని తహతహలతో లోలోన అంతరాయం
జవాబులు ఇవ్వలేని చిక్కుప్రశ్నలతో ఆరాటం 
మనసు అలజడులతో చెప్పలేని నిస్సహాయత 
అక్షర స్వరములై నిలచెనే భావ అంతర్మధనం!

Friday, 15 December 2017

ద్వారం

ఒక తలుపు మూసుకుపోతే
వేరొకటి తెరిచే ఉంటుంది....
మనమే మూసిన ద్వారం వంక 
చూస్తూ బేలగా ఉండిపోతుంటాం!!!

Sunday, 3 December 2017

నాలో..

నాలోన తాను, తనలోన నేను
మరిచేము అనురాగ బంధాన మేను
నిండైన వెన్నెల్లో ఏకాంత తరుణాన
చూపుల్తో మౌనాన్ని దాల్చేము మేము..

Friday, 13 October 2017

వెలుగు

రేయంతా తారలు విరహంతో రగిలే
వెనుక తిరిగి చూడనన్న జ్ఞాపకాలు 
కాళ్ళ పగుళ్ళు ఆలోచనలై మండగా
బయట వెలుగు మదిన చీకటి కాసె!

Friday, 6 October 2017

ప్రేమంటే

ప్రేమంటే మనసులో పుట్టి ఆకాశం అంచులు తాకేది
ప్రేమంటే ఉదయించే వెలుగే కాదు అస్తమించే చీకటి 
ప్రేమంటే అనేకసార్లు మోడుబారినా చిగురించే ఆశలు
ప్రేమంటే నిట్టూర్పు నిరాశ సెగలు కాదు ఒక భరోసా!